Share News

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డీపీవో

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:53 PM

తిమ్మాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలోని ఎన్నికల సామగ్రిగని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డీపీవో
తిమ్మాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న డీపీవో జగదీశ్వర్‌

తిమ్మాపూర్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిమ్మాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలోని ఎన్నికల సామగ్రిగని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్బంగా బ్యాలెట్‌ పేపర్లు, ఇతర సామాగ్రిని పరిశీలించి ఎంపిడివో రాజీవ్‌ మల్హోత్రాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రిటర్నింగ్‌ అధికారులతో డీపీవో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లపై డీపీవో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీవ్‌ మల్హోత్ర, ఎంపీవో సురేందర్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:53 PM