Share News

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:48 PM

ఇళ్లులేని నిరుపేదల కోసం నిర్మిం చిన డబుల్‌ బెడ్‌రూంలను పంపిణీ చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లులేని నిరుపేదల కోసం నిర్మిం చిన డబుల్‌ బెడ్‌రూంలను పంపిణీ చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్‌ రోడ్డులోని నర్సింగ్‌ కళాశాల పక్కన నిర్మించిన డబుల్‌ బెడ్‌రూంలను మంగళవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిరుపేదల కోసం లక్షల రూపాయలను ఖర్చులు చేసి నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. డబు ల్‌ బెడ్‌రూంలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయని ఇప్పటికైనా ఇన్‌చార్జి కలెక్టర్‌ స్పందించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రఽధాన కార్యదర్శి మెర్గు శ్రీనివాస్‌, కొండ నరేష్‌, మోర రవి, నర్సయ్య, దూడంసురేష్‌, శ్రీనివాస్‌, కాంభోజ శ్రీధర్‌, అంకారపు రాజు, దేవరాజు, వడ్నాల శేఖర్‌, బాబు, అభి, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:48 PM