Share News

చదువును నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:20 AM

విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో భర్తీ చేయలేనం త నష్టం జరుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషావేత్త నలిమెల భాస్కర్‌ పేర్కొన్నారు.

చదువును నిర్లక్ష్యం చేయొద్దు

ఫొటో

04 :

ముస్తాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో భర్తీ చేయలేనం త నష్టం జరుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషావేత్త నలిమెల భాస్కర్‌ పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థు లతో ఏర్పాటు చేసిన సమావేశంలో నలిమెల భాస్కర్‌ మాట్లాడారు. ఆవునూర్‌ గ్రామ గొప్పతనాన్ని చైతన్యాన్ని వివరించారు. గ్రామంలో జన్మించిన గొప్పగొప్ప కవులు, పండితుల గురించి వివరించి అలా తయారవ్వాలని కోరారు. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటి కథ రాసిన వ్యక్తి ఆవునూరి వేణుగోపాల్‌రావు అని, అలాగే ఏడవ తరగతి పాఠ్యపుస్త కంలో మా ఊరు అనే పదాన్ని రాసింది ఆవునూరి వెంకటశాస్ర్తి అని, వీరు ఇదే గ్రామానికి చెందిన వారని గుర్తు చేశారు. కష్టపడితే సాధించనిది అంటూ ఏది ఉండదని, గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలని, సమయాన్ని వృథా చేయకుం డా చదువకునే సమయంలో శ్రద్ధగా చదువుకోవాలన్నారు. దేశానికి సంపద నేటి విద్యార్థులేనని, దేశ ఔన్నాత్యాన్ని కాపాడగల శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. చదువు ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మద్దికుంట లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు శారద, పర్శరామలు, లక్ష్మీనారా యణ, గణేశ్‌, విశ్వనాథ్‌, టి, కవిత, కె కవిత, ప్రభాకర్‌, మనోహర్‌, పద్మలత, శ్రీలత, అనురాధ, దీప్తి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:20 AM