నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోరా..
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:43 PM
కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలు దోపిడికి పాల్పడ్డా అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బామండ్లపల్లి యుగేందర్ విమర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా వద్ద కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
గణేశ్‌నగర్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలు దోపిడికి పాల్పడ్డా అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బామండ్లపల్లి యుగేందర్ విమర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా వద్ద కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్బంగా బామండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన విద్యార్హతలు లేని వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారన్నారు. ఇటీవల ఓ కాంపౌండర్ చిక్సిత కోసం వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడడం భాధకారమన్నారు. గతంలోనూ ఓ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనే జరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై పలుమార్లు వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రకరకాల పరీక్షలు, అనవసర ఆపరేషన్లతో పేద, మధ్య తరగతి ప్రజల నుంచి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు చెంచల మురళి, సంతోష్, సదాశివ, సురేందర్, సత్యం, రాజు, మహేందర్, మహేష్, సన్నీ, మణికంఠ పాల్గొన్నారు.