ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాల అందజేత
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:04 AM
వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సీఎస్‌ఆర్ నిధులతో కోటి విలువ చేసే మెడికల్ పరిక రాలను అందజేసినందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, చెన్న మనేని వికాస్‌రావు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వేములవాడ టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సీఎస్‌ఆర్ నిధులతో కోటి విలువ చేసే మెడికల్ పరిక రాలను అందజేసినందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, చెన్న మనేని వికాస్‌రావు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో బుధవారం పరికరాలను పరిశీలించారు. అనంతరం గోపి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, అభివృద్ధి చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏరియా ఆసుపత్రికి అందించిన పరికరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుతు న్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాడి రమేష్, లింగం పల్లి శంకర్, సిరికొండ శ్రీనివాస్, రేగుల సంతోష్‌బాబు, జక్కుల తిరుపతి, రాపెల్లి శ్రీధర్, పరమేష్, శేఖర్, బాలాజీ, విజయేందర్ ఉన్నారు.