యూరియా అధికంగా వాడొద్దు
ABN , Publish Date - May 06 , 2025 | 12:04 AM
రైతులు పంటల సాగు చేసేటప్పుడు యూరియా అధికంగా వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. జమ్మికుంట మండలం మడిపల్లిలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
జమ్మికుంట, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులు పంటల సాగు చేసేటప్పుడు యూరియా అధికంగా వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. జమ్మికుంట మండలం మడిపల్లిలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలని సూచించారు. క్రిమి సంహారక మందులు విచక్షణ రహితంగా వాడకూడదని తెలిపారు. పచ్చి రోట్ట పైరులు, సేంద్రీయ ఎరువులను తప్పకుండా వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడి భావితరాలకు సారవంతమైన నేలలను అందించాలన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త వహిస్తూ వాటి రసీదులను పంటకాలం ముగిసే వరకు భద్రపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉధ్యానవన అధికారి శ్రీనివాస్‌రావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పాల్‌టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫేసర్ నరేందర్, డాక్టర్ ఇ నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.