Share News

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దు

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:59 PM

తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని సీపీ గౌస్‌ఆలం ఓ ప్రకటనలో తెలిపారు.

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దు

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని సీపీ గౌస్‌ఆలం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండవద్దన్నారు. ఈ మేరకు భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డిసెంబరు 11న జరగనున్న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ఉత్తర్వులు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Dec 09 , 2025 | 11:59 PM