రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయొద్దు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:07 AM
రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయవద్దని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. సోమవారం నగరంలో కమిషనర్ పర్యటించారు. నగరంలోని రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్‌ను సందర్శించి పారిశుధ్య పనులు, ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలను తనిఖీ చేసి పరిశీలించారు.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయవద్దని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. సోమవారం నగరంలో కమిషనర్ పర్యటించారు. నగరంలోని రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్‌ను సందర్శించి పారిశుధ్య పనులు, ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులను మెరుగ్గా చేయాలన్నారు. రోడ్లపై చెత్తపడకుండా పారిశుధ్య అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు గార్బెజ్ పాయింట్లను శుభ్రపరిచి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. డివిజన్ల వారీగా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను వేరు చేసి సేకరించాలని, ప్రతి స్వచ్ఛ ఆటో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన డీఆర్‌సీసీకి వెళ్లాలని తెలిపారు. డీఆర్‌సీసీకి వెళ్లిన అనంతరమే మిగిలిన చెత్తను డంపునకు తరలించేలా జవాన్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లను ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేసే వారికి జరిమాన విధించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, పారిశుధ్య, డీఆర్‌సీసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.