Share News

ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో తనిఖీ

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:11 AM

సిరిసిల్ల పట్టణంలోని అంబే ద్కర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిత తనిఖీ నిర్వహించారు.

ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో తనిఖీ

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణంలోని అంబే ద్కర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిత తనిఖీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాధి నిరో ధక టీకాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలపై వైద్యాధికారి, సిబ్బందితో సమీక్షించారు. సకాలంలో లక్ష్యాలను సాధించాలని, వర్షాలు కురుస్తున్నందున గృహ సర్వేలు నిర్వహించాలని ఆదే శించారు. విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. వెంట ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ రేఖ, సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:11 AM