Share News

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్‌..

ABN , Publish Date - May 30 , 2025 | 12:37 AM

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోల్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఖరీఫ్‌ సాగు ఇతర అభివృద్ధి పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొని వివిధ అంశాలను వివరించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్‌..

సిరిసిల్ల, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోల్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఖరీఫ్‌ సాగు ఇతర అభివృద్ధి పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొని వివిధ అంశాలను వివరించారు. గురువా రం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రు లు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబులతోపాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఉమ్మడి జిల్లా లో పలు పనులపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అధికారులను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. జిల్లాకు మంజూరైన 7,862ఇళ్లకు 7,808 ఇళ్ల ప్రొసీడింగ్‌ ఆర్డర్‌లను లబ్ధిదారులకు అందజేశారు. ఒకటి,రెండు ఫేజ్‌లకు సంబంధించి వేములవాడ నియోజకవర్గంలో 2,575ఇళ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో 3,608ఇళ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లిలో 820 ఇళ్లు, మానకొండూర్‌ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మం డలంలో మొదటి ఫేజ్‌లో 42ఇళ్ల పత్రాలు అందించగా, ఫేజ్‌లో 2లో763 పత్రాలు ఇవ్వనున్నారు. ప్రొసీడింగ్‌లను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌,ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు అందజేశారు. జిల్లాలో మొత్తం మొదటి విడతలో 439 ఇళ్లు మంజూరుచేయగా 135ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్‌ను అభినందించారు.

Updated Date - May 30 , 2025 | 12:37 AM