ముగిసిన జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:05 AM
జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు.
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జూనియర్స్ విభాగంలో అండర్-14, 16, 20 వయస్సు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన క్రీడాకారులను 30 మందిని ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల నిర్వహణను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ పర్యవేక్షించగా, జిల్లా అథ్లెటిక్ సంఘ సభ్యులు చంద్రశేఖర్, ఎస్ రమేష్, హరికిషన్, గోపాల్, డాక్టర్ ఎజాజ్ అహ్మద్, సుమన్, కోచ్‌లు వరుణ్ కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.