Share News

జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె.. వాయిదా

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:51 PM

పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా జనరల్‌ ఆసుపత్రి కార్మికులు శుక్రవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్‌ మాట్లాడుతూ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె.. వాయిదా
ధర్నా చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సభ్యులు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా జనరల్‌ ఆసుపత్రి కార్మికులు శుక్రవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్‌ మాట్లాడుతూ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి హామీ ఇచ్చారని, ఈ మేరకు సమ్మెను మూడు రోజుల వరకు వాయిదా వేసినట్లు తెలిపారు. వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళతామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు పి అరుణ్‌, కార్యదర్శి టి కళావతి, ఉపాధ్యక్షురాలు శారద, రాజు, మహేశ్‌, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ పాల్గొన్నారు.

ఫ నెల జీతం విడుదల...

కార్మికులకు సంబందించి మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఈ విషయమై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా జనరల్‌ అసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం నెల జీతం విడుదల అయిందని, మరో రెండు మూడు రోజుల్లో మిగితా రెండు నెలల జీతాలు అందజేస్తామన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:51 PM