Share News

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:01 AM

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు.

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

ఇల్లంతకుంట, నవంబరు 4(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని జిల్లాపరిషత్‌ పాఠశాల ఆవరణలో మంగళవారం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌ కుమార్‌ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మోదీ కానుక ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. పేదరిక విద్యార్థిగా ప్రస్థానం ప్రారంభించిన సంజయ్‌కుమార్‌ కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో 20వేల సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోదీ కిట్‌ పేరుతో సహాయాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సంజయ్‌కుమార్‌కు రిటర్న్‌గిఫ్ట్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డీఈఏ లక్ష్మీరాజం, ఎంపీడీవో శశికళ, ఎంఈవో చెప్యాల శ్రీనివాస్‌, ఎస్సై అశోక్‌, సీపీడీవో రోజ, ప్రధానోపాధ్యాయులు ప్రేమలత, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్‌, నాయకులు గుజ్జ శ్రీనివాస్‌, అడిచెర్ల రాజు, మండల ఇన్‌చార్జి సంఘ నరేష్‌, రిటైర్డ్‌ తహసీల్దార్‌ సామ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:01 AM