380 రాజన్న కోడెల పంపిణీ
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:36 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలోని కోడెల పంపిణీ కొనసాగుతుంది.
వేములవాడ కల్చరల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలోని కోడెల పంపిణీ కొనసాగుతుంది. కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆధ్వర్యంలో బుధవారం అర్హులైన రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతుల ధ్రువపత్రాలను పరిశీలించి అనంతరం 380 కోడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజన్న కోడెలను పొందిన రైతులు కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. వ్యవసాయ పనులకు మాత్రమే కోడెలను ఉపయోగించుకోవాలని తెలిపారు. రైతులు పొందిన కోడెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి, పశువైద్యాధికారితో పాటుగా ఆలయ అధికారులు ఉన్నారు.