Share News

విద్యతోనే విచక్షణా జ్ఞానం..

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:07 AM

విద్యతోనే విచక్షణ జ్ఞానం లభిస్తుం దని సిరిసిల్ల ఇంచార్జ్‌ ఆర్డీవో ఆర్వీ రాధాబాయి అన్నారు.

విద్యతోనే విచక్షణా జ్ఞానం..

సిరిసిల్ల రూరల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : విద్యతోనే విచక్షణ జ్ఞానం లభిస్తుం దని సిరిసిల్ల ఇంచార్జ్‌ ఆర్డీవో ఆర్వీ రాధాబాయి అన్నారు. సిరిసిల్ల పట్టణం శివనగర్‌లోని కుసుమరామ య్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన ఇంచార్జ్‌ ఆర్డీవో మాట్లాడుతూ విద్యతోనే జీవితాన్ని సరైన దిశలో మలుచుకునే సామర్ధ్యం లభిస్తుందన్నారు. విద్య అనేది జ్ఞానాన్ని అందించడం లేదా సంపాదిం చడం ద్వారా పరిణితి చేకూరుతుందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని కాకుండా సమాజ వికాసానికి అభివృద్దికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్ట పడి చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లకావత్‌మోతీలాల్‌, అమ్మ అదర్శ పాఠ శాల చైర్మన్‌ ఉమా, మాజీ కౌన్సిలర్‌ గెంట్యాల శ్రీనివాస్‌, స్టాఫ్‌ కార్యదర్శి మల్లేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:07 AM