Share News

ప్రజాపాలనలో విద్యార్థులకు కష్టాలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:43 PM

: ప్రజాపాలనలో విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని చదువులకు చేస్తోందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు.

ప్రజాపాలనలో విద్యార్థులకు కష్టాలు

గణేశ్‌నగర్‌,నవంబరు6(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని చదువులకు చేస్తోందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలు బంద్‌ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే లక్షల మంది విద్యార్థులతో సీఎం ఇంటిని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఫీజు బకాయలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్‌ ్స తనిఖీలు నిర్వహించాలని ఆన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మచ్చ రమేష్‌, రేణికుంట్ల ప్రీతం, మంద, అనిల్‌, రామారాపు వెంకటేష్‌ ,కుర్ర రాకేష్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ మామిడిపల్లి హేమంత్‌,కనకం సాగర్‌, కేశపోయిన రాము యాదవ్‌, లద్దునూరి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:43 PM