Share News

ఓట్‌ చోరీతోనే కాంగ్రెస్‌ రాష్ట్రంలో గెలిచిందా?

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:23 AM

ఓట్‌ చోరీతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందా...? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఓట్‌ చోరీతోనే కాంగ్రెస్‌ రాష్ట్రంలో గెలిచిందా?

హుజూరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఓట్‌ చోరీతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందా...? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ జిల్లాలో పర్యటించిన సందర్భంగా బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసినందుకా.. జనహిత పాదయాత్ర అని ప్రశ్నించారు. అది జనహిత పాదయాత్ర కాదు.. జనద్రోహ పాదయాత్ర అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు బీజేపీపై పనికి మాలిన విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి ఎనలేని సేవలు చేసిన చరిత్ర ఉందన్నారు. 42శాతం రిజర్వేషన్‌ పేరుతో 10శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టి బీసీల గొంతుకోసే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తోందన్నారు. నిజామాబాద్‌ ప్రజల దెబ్బకు తట్టుకోలేక మహేష్‌కుమార్‌గౌడ్‌ పారిపోయాడన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో ఎర్రబెల్లి సంపత్‌రావు, నర్సింహారాజు, బింగి కరుణాకర్‌, రాజు, కొంరయ్య, సంపత్‌రావు, పైళ్ల వెంకట్‌రెడ్డి, యాళ్ల సంజీవరెడ్డి, గంగిశెట్టి రాజు, కాశెట్టి కుమార్‌, రాజశేఖర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:23 AM