బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టును నిరసిస్తూ ధర్నా
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:17 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్‌రావు, నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యం లో నాయకులు ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్‌రావు, నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యం లో నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడారు. గోరక్షకుడు ప్రశాంత్‌పై కాల్పులు జరగడం హిందు సమాజ హృదయాలను గా యపరిచిందన్నారు. ఈ అమానుష చర్యకు నిరసనగా కాల్పులు జరిపిన దుం డగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని వారందరిని అప్రజాస్వామ్యంగా అరెస్టు చేయడా న్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గోరక్షకులపై కాల్పులు, దాడులు జరుగు తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. హిందూ సమాజ మనో భావాలను దెబ్బతీసే ప్రతి కుట్రను బీజేపీ బట్టబయలు చేస్తుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాం ప్రసాద్, గూడూరి భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీహరి, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, నాయకులు ఆంకారపు రాజు, శ్రీనివాస్, నరేష్, భాగయ్య, సూరం వినయ్, కోడం రవి, విష్ణు, దేవరాజు, శేఖర్, గాలి శ్రీనివాస్, మహిళా మోర్చా నాయకురాలు వేముల వైశాలి పాల్గొన్నారు.