నులి పురుగుల మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:38 AM
పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
తంగళ్లపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నులి పురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ సంవత్సరం నుంచి 19 సంవ త్సరాల వయసు గల పిల్లలందరికి అల్ఫెండజోల్ మాత్రను ఇవ్వాలని ఆదేశించారు. మాత్రను అందించి నమిలి మింగేలా చూడాలన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలందరికి నులి పురుగుల మాత్రలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 18 వ తేదిన మ్యాప్ డే రోజు మిగిలిపోయిన పిల్లలందరికి అందించాలని ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి సూచించారు. మాత్రల ఆవశ్యకత తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, తంగళ్లపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి, పాఠశాల హెచ్‌ఏం శంకర్ నారాయణ, ఏఎన్‌ఎం లు ప్రమీల, జ్యోతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.