Share News

వేములవాడ రాజన్నకు భక్తుల నీరాజనాలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:43 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి భక్తులు నీరాజనాలు పలికారు.

వేములవాడ రాజన్నకు భక్తుల నీరాజనాలు

వేములవాడ కల్చరల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి భక్తులు నీరాజనాలు పలికారు. శుక్రవారం ఉదయం నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకుని పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రాజన్న ఆలయ అన్నదాన ట్రస్టుకు విరాళం..

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌ సోమాజిగూడకు చెందిన నీలగిరి శంకరరావు కుటుంబ సభ్యులు రూ. లక్షా 11వేల 111 చెక్కును ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు. రాజన్న ఆలయానికి వచ్చిన వారు శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఏఈవోను కలిసి చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:43 AM