భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:44 AM
మాఘ అమావాస్య జాతరకు భక్తులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాఘ అమావాస్య జాతరకు భక్తులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావు పేట మండలం మామిడిపల్లి గ్రామంలోని రాజ రాజేశ్వర స్వామి దత్తత సీతారామస్వామి దేవ స్థానం మాఘ అమావాస్య జాతర సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనవరి 18న మాఘ అమావాస్య జాతర వేడుకలను అత్యం త వైభవోపేతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవం తంగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. జాతర ఉత్సవాలకు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో మనం జాతర ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి, తహసీ ల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ పంన్నర లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ బాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.