వేములవాడ రాజన్నకు భక్తుల మొక్కులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:38 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రాజన్నకు మెక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రాజన్నకు మెక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకుని, ధర్మగుండంలో పవిత్రస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీపార్వతిరాజరాజేశ్వర స్వామివారలను దర్శించుకుని తరించారు. రాజన్నకు ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాత్యాయని అలంకారంలో అమ్మవారి దర్శనం
దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారు ఆదివారం ఏడో రోజున కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు స్వామివారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.