Share News

అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:03 AM

అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ పేర్కొన్నారు.

అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు

ఇల్లంతకుంట, నవంబరు 4( ఆంధ్రజ్యోతి) : అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం అలింకో, ఏడీఐపీ, ఆర్వీవై ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు దివ్యాంగులని వివక్షత చూపవద్దని, అందరితో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు. దివ్యాంగులు యూడీఐడీ కార్డు కోసం మొబైల్‌ లేదా మీసేవా ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు కేటాయించిన రోజులలో దవాఖానకు వెళ్లాలని, అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరాలను ఏర్పాటు చేసి అర్హులకు పరికరాలను అందిస్తున్న అలింకో బాధ్యులను అభినందించారు. అర్హత సాధించిన వారికి చేతి, చంక కర్రలు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, టెట్రాప్యాడ్‌, మోకాళ్ల పట్టీలు మొదలైన సహాయక పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు కావలసిన పత్రాలు వెంట తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీవో ఉమారాణి, ఎంపీడీవో శశికళలతో పాటు వివిదశాఖల అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలి..

వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని నిర్వాహకులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ సూచించారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికి ఇంటి పనులను ప్రారంభించని వారు వారంరోజుల్లో ప్రారంభించాలని లేనట్లయితే రద్దుచేయడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ శంకర్‌, ఎంపీడీవో శశికళ, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, ఏపీఎం లతామంగేశ్వరిలతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:03 AM