అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:18 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగాపూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగాపూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్ట రేట్‌లో శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. ముందుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతి రోజు అందిస్తు న్న ఓపీ, వైద్యసేవలపై అడిగితెలుసుకున్నారు. వివిధ వార్డుల్లో రూఫ్ లీకేజీ మరమ్మతుపనులు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఆధునీకరణ, పెయిం టింగ్, ఏసీ, మరుగుదోడ్ల మరమ్మతు, మెష్‌డోర్స్ ఏర్పాటు, మెటర్నిటీ వార్డులోని ఓపీ వద్ద పెయింటింగ్, మెష్ డోర్స్ ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేయా లని కోరారు. ఇంకా ఔట్‌పేషెంట్ మేల్ వార్డు మందులు తీసుకునే వద్ద షెడ్ ఏర్పా టు అదనంగా నల్లా కనెక్షన్‌లతో పాటు ఆక్సిజన్ స్టోరేజ్ గదిలో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ టీజీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సభ్వత్వ నమోదు పెంచాలని, వైద్యులు, సిబ్బంది, ఆయా శాఖల అఽధికారులతో నమోదు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జీజీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్య కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్‌రాజేశ్వరీ, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌రజిత, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్‌లు అవాస్‌గౌరీ, ఎం లక్ష్మీనారాయణ, సుగుణ, ప్ర సాద్, ఐఎంఏ అధ్యక్షుడు శోభారాణి, ఆర్‌ఎంవో డాక్టర్ కపిల్ సాయి, లయన్స్ క్లబ్ బాధ్యులు నాగుల సంతోష్, రెడ్‌క్రాస్ బాధ్యులు ప్రయాక రావు వేణు, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.