అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:30 AM
వేములవాడ శ్రీభీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీభీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. భీమేశ్వర ఆలయం, వీఐపీ రోడ్డు, పార్కింగ్ స్థలాలతో పాటుగా ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలు, షెడ్లు, శంకరమఠంలో నిర్మిస్తున్న అభిషేకం, కళ్యాణ మండపాలు, క్యూలైన్‌ల పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వేద పాఠశాల ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు చేస్తున్న వసతులపై సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట ఈవో రమాదేవి, కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేష్, రఘునందన్, మహిపాల్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.