Share News

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:01 AM

గ్రామీణ ప్రాం తాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పలు అబివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖా అధికారులతో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సమీక్ష నిర్వహించారు. డిఆర్డీఏ, పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, సెగ్రిగేషన్‌ షెడ్‌, అంగన్‌వాడీ కేంద్రాలలో మౌళిక వసతుల కల్పన తదితర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ జిల్లాలో 26 గ్రామ పంచాయ తీ భవనాలు నిర్మాణం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అన్నా రు. ముందుగా రెండు వేల కంటే ఎక్కువ జనభా ఉన్న ఆవాసాల నకు మొదటి ప్రాధాన్యతగా, 1500 జనాభా ఉన్న ఆవాసాలకు తదు పరి ప్రాధాన్యతగా జిపి భవనా నిర్మాణం పనులు చేపట్టాలని అన్నారు. సిరిసిల్ల వేములవాడలో రూ. 1.28 కోట్ల వ్యయంలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ శేషాద్రి, డిడబ్ల్యువో లక్ష్మిరాజ్యం, పిఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డిపివో షరీఫుద్దీన్‌, ఆర్‌అండ్‌బి అధికారులు తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 01:01 AM