Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:44 AM

జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ. ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ. ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలె క్టర్‌ కార్యాలయంలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీలలో జరు గుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటీతో పాటు మిగతా రెండు మున్సిపాలిటీ పరిధుల్లో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అధికారులు మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించగా వేసవి కాలంలోపు పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ అమృత్‌ 2.0, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నగరాభివృద్ధి పనులు జరుతున్నాయని సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ రాజా గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:44 AM