కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:48 AM
కేసీఆర్ మళ్లీ ముఖ్య మంత్రిగా వస్తేనే పల్లెలు అభివృద్ధి చెందుతాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట విద్యాసాగర్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు
జగిత్యాల అర్బన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ మళ్లీ ముఖ్య మంత్రిగా వస్తేనే పల్లెలు అభివృద్ధి చెందుతాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం జగిత్యాల నియోజక వర్గం లోని సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లె మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన అనుచరులు, ధర్మనాయక్ తండాకు చెందిన చందూనాయక్, ఆయన అను చరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి విద్యాసాగర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విసుగు చెందిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుం టున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అనే సోయి తప్పి మాట్లాడు తున్నారని విమర్శించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రకు అప్పజెప్పిన గుట్టు రట్టు అవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాని విమర్శించారు. ఈ కార్యక్రమం లో సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచ్‌లు సంతోష్ భార తి, చిరంజీవి, బీఆర్‌ఎస్ నాయకులు సాగి సత్యంరావు, చిట్ల రమణ, ధరిశెట్టి రాజేష్, వరు సాయిరెడ్డి, అనంతుల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.