Share News

ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లా అభివృద్ధి

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:48 AM

ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందు కు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లా అభివృద్ధి

సిరిసిల్ల ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందు కు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో కే కన్వెన్షన్‌ హాల్లో నేతన్న పొదుపు(త్రిప్ట్‌), నేతన్న బీమా పథకాల చెక్కు లను వ్యవసాయ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావుతో కలిసి ఆది శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా నేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. వస్త్ర పరిశ్రమలో రూ.352 కోట్ల బకాయిలను రేవంత్‌ సర్కార్‌ చెల్లించిందని అన్నారు. చేనేత కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో రూ 270 కోట్ల విలు వగల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని వెల్ల డించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామ య్యార్‌ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల ఆర్డర్లను ఇప్పిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద ఉత్పత్తి చేసే ఆర్డర్లతో ఒక్కో కార్మికుడికి నెలకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. ఆర్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ నేతన్న పొదుపు(త్రిప్ట్‌) పథకం కింద జిల్లాకు చెందిన 4963 మంది వస్త్ర పరిశ్రమ కార్మికులకు రూ 24.80 కోట్లు, నేతన్న బీమా ఉండి మరణించిన 12 చేనేత కార్మికుల కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ కింద రుణాలు రెన్యువల్‌ చేస్తున్నామన్నారు. చేనేత కార్మికుల సంక్షే మం కోసం ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్‌ రెడ్డి మాట్లాడు తూ బతుకమ్మ చీరల ఉత్పత్తి బకాయిలు దాదాపు రూ 250కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. స్వశక్తి మహిళా సంఘాలోని మహిళలకు రెండు నాణ్యమైన చీరలు అందిం చాలని నిర్ణయించి, ఆ చీరల ఉత్ప త్తి ఆర్డర్‌ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కు కేటాయించామన్నారు. వేము లవాడలో రూ 50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామన్నారు. నేత న్న పొదుపు, నేతన్న బీమా, నేత న్నలకు లక్ష రూపాయల రుణ మాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్‌ బి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయ ణ గౌడ్‌, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్వీరావు, ఏడీ రాఘవరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, నేత కార్మికులు, ఆసాములు ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:48 AM