తల్లిదండ్రుల భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలల అభివృద్ధి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:35 AM
తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ అన్నా రు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన సం దర్శించారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న అంశాలపై పట్టు సాధించాలన్నారు. తరగతి గదులు, ప్రహారీ, విద్యార్థులకు ఆర్టీసీ బస్సు స్టాప్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పష్టం చేశారు. కళాశాల మైదానంలోని పిచ్చి మొక్కలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో సత్తయ్యను ఆదే శించారు. డీఐఈవో శ్రీనివాస్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, ప్రిన్సిపాల్ పద్మావతి, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.