Share News

గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటే అభివృద్ధి

ABN , Publish Date - May 22 , 2025 | 12:52 AM

గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.

గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటే అభివృద్ధి

ఇల్లంతకుంట, మే 21 (ఆంధ్రజ్యోతి) : గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం పత్తికుంటపల్లె గ్రామంలోని ఫంక్షన్‌ హాల్‌కు నిధుల మంజూరు పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామంలో జరిగే శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని మిగులు పనుల కోసం డీ ఎమ్‌ఎఫ్‌టీ నిధుల ద్వారా రూ 30లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. ఈసందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్యయాదవ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, ఏలేటి మాధవరెడ్డి, బోడ శ్రీనివాస్‌రెడ్డి, ఏగుర్ల మల్లయ్య, తిరుపతి, నవీన్‌, చింతలపెల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:52 AM