Share News

ఆక్రమణల కూల్చివేతలు... రోడ్ల విస్తరణలు...

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:33 AM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాదిలో అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉంది. ప్రభు త్వం నుంచి వివిధ పథకాల ద్వారా సుమారు రూ.500కోట్లు నిధులు విడుదలయ్యాయి. మౌలిక వసతులు, మంచినీటి సరఫరా, ఎస్‌టీపీల నిర్మాణం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, కూడళ్ల అభివృద్ధి వంటి పనులకు నిధులు వెచ్చిస్తున్నారు.

ఆక్రమణల కూల్చివేతలు...   రోడ్ల విస్తరణలు...
రాజీవ్‌ రహదారి జీఎం కాలనీ వద్ద రహదారి విస్తరణ

రామగుండంలో రూ.500కోట్లతో అభివృద్ధి పనులు

రూ.24కోట్లతో షాపింగ్‌ కాంప్లెక్స్‌

రూ.246కోట్లతో ఎస్‌టీపీల నిర్మాణం

రూ.88కోట్లతో ఏడు కొత్త ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైప్‌లైన్లు...

నాలాల ఆధునికీకరణ.. ప్రతీ కాలనీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ

కోల్‌సిటీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాదిలో అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉంది. ప్రభు త్వం నుంచి వివిధ పథకాల ద్వారా సుమారు రూ.500కోట్లు నిధులు విడుదలయ్యాయి. మౌలిక వసతులు, మంచినీటి సరఫరా, ఎస్‌టీపీల నిర్మాణం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, కూడళ్ల అభివృద్ధి వంటి పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. గతంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా ఉంటే ప్రస్తుతం రోజు నీటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్‌టీపీసీ 24గంటల నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ నగరాభివృద్ధి ప్రణాళికలు కన్సల్టెంట్లతో డీపీఆర్‌లు తయారు చేయించి నిధులు మం జూరు చేయిస్తున్నారు. రాజీవ్‌ రహదారి సర్వీస్‌ రోడ్లకు మోక్షం కలిగింది. నగరంలో పోచమ్మ మైదానం, ఓల్డ్‌ అశోక థియేటర్‌ వంటి ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతలతోపాటు రోడ్ల విస్తరణ జరుగుతుంది. ఇదే సమ యంలో రూ.25కోట్ల సింగరేణి నిధులతో 300గదుల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రూ.100కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ ప్రాంతాలకే రూ.35కోట్లు కేటాయించారు. రూ.13కోట్ల స్టాంప్‌ డ్యూటీ నిధులతో ప్రతీ డివిజన్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. రూ.3కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు, రూ.50కోట్ల యూఐడీఎఫ్‌, డీఎంఎఫ్‌టీ, సింగరేణి, ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.28కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేస్తున్నారు. శాలపల్లి రోడ్డు, కృష్ణానగర్‌ రహదారులకు కలెక్టర్‌ నిధుల నుంచి రూ.4కోట్లు కేటాయించారు. రూ.246కోట్ల అమృత్‌ నిధులతో ఎస్‌టీపీల నిర్మాణం జరుగుతుంది. గోదావరిలో కాలుష్యాన్ని నివారిం చేందుకు మల్కాపూర్‌, రామగుండం, యైుటింక్లయిన్‌కాలనీ, జనగామలో ఎస్‌టీపీల నిర్మాణం చేస్తున్నారు. నాలుగు గ్రామాలను రామగుండం కార్పొరేషన్‌లో విలీనం చేసి 60డివిజన్లుగా విభజించారు. ఎల్కలపల్లి గేట్‌, వెంకట్రావ్‌పల్లి, లింగాపూర్‌, కుందనపల్లి అక్బర్‌నగర్‌లను కార్పొరేషన్‌లో విలీనం చేశారు.

ఏడు కొత్త ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రూ.88కోట్లతో ఏడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, 16.5కోట్ల ఫీడర్‌ మెయిన్‌, 68 కిలోమీటర్ల డిస్ర్టిబ్యూషన్‌ లైన్‌ నిర్మిస్తున్నారు. లింగాపూర్‌, రామగుండం ఎస్‌టీ కాలనీ, పవర్‌హౌస్‌ కాలనీ, సీఎస్‌పీ, అశోక్‌నగర్‌, సంజయ్‌గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం జరుగనున్నది.

ఎన్‌టీపీసీ నుంచి పన్నుల వసూళ్లు...

ఎన్‌టీపీసీ సంస్థ గతంలో రామగుండం నగరపాలక సంస్థకు నిధులు ఇవ్వకుండా కొరివిలు పెట్టేది. ఇప్పుడు ఎన్‌టీపీసీ నిర్మాణ అనుమతుల విషయంలో నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం నిక్కచ్చిగా వ్యవహ రిస్తోంది. దీంతో అనివార్యంగా నిర్మాణ ఫీజులు చెల్లిస్తుంది. రూ.20కోట్ల మేర ఫీజులు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.

సర్వీస్‌ రోడ్లకు మోక్షం...

ఎందరో ప్రాణాలను బలిగొన్న రాజీవ్‌ రహదారికి సర్వీస్‌ రోడ్లకు ఎమ్మెల్యే చొరవతో మోక్షం లభించింది. ఆర్‌అండ్‌బీకి రూ.20కోట్ల నిధులు మంజూరు చేయించి సర్వీస్‌ రోడ్డు పనులు ప్రారంభించారు. రామగుండం పట్టణంలో ప్రధాన రహదారి రూ.10కోట్లతో నిర్మాణం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ.20కోట్లు రామగుండానికి కేటాయించారు. రైల్వే ఫ్లై ఓవర్‌ రైట్‌ ఆర్మ్‌ నిర్మాణానికి రూ.25కోట్లు, ఎంపీ డీఓ కార్యాలయం పెద్దంపేట రహదారికి రూ.10కోట్లు కేటాయించారు.

రూ.150కోట్లతో ఈఎస్‌ఐ ఆసుపత్రి

రామగుండం పట్టణంలో రూ.150కోట్లతో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. అత్యాధునిక ఆసు పత్రితోపాటు వైద్యులకు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం కూడా జరుపనున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని కాంట్రాక్టు కార్మికులకు, ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్య సౌకర్యం కలుగనున్నది. అలాగే గోదావరిఖనిలో సిమ్స్‌ అనుబంధంగా 400పడకల ఆసుపత్రి నిర్మా ణం జరుగుతుంది. అలాగే సింగరేణి ఆసుపత్రి వద్ద ప్రజల సౌకర్యార్థం రూ.15కోట్ల క్యాత్‌ ల్యాబ్‌ నిర్మాణం జరుగుతుంది.

విద్యుత్‌ కేంద్ర ప్రకటనతో ఊపిరి..

బీ పవర్‌హౌస్‌ మూసివేతతో ఈ ప్రాంతంలో ఉపాధి తగ్గడంతో పాటు రామగుండం పట్టణ మనుగడే ప్రశ్నార్థంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 800మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర స్థాపనకు ఆమోదం తెలిపింది.

Updated Date - Dec 31 , 2025 | 01:34 AM