Share News

రోడ్డుకు అడ్డుగా ఉన్న భవనం కూల్చివేత

ABN , Publish Date - May 25 , 2025 | 01:05 AM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీ ప్రధాన రహ దారిపై ఉన్న ఓ భవనం చూస్తుండగానే శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది.

రోడ్డుకు అడ్డుగా ఉన్న భవనం కూల్చివేత
గోదావరిఖని మార్కండేయ కాలనీలో కూలుతున్న భవనం

- చూస్తుండగానే కుప్పకూలిన భవనం

- ఎక్స్‌కావేటర్‌పై పడిన భవన శిథిలాలు

- తప్పిన పెను ప్రమాదం

కోల్‌సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీ ప్రధాన రహ దారిపై ఉన్న ఓ భవనం చూస్తుండగానే శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన శిథిలాలు ఎక్స్‌ కావేటర్‌పై పడడంతో ఆపరేటర్‌ క్షేమంగా బయట పడ్డాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. రామ గుండం నగరపాలక సంస్థ పరిధిలోని మార్కండే యకాలనీ రాజేష్‌ థియేటర్‌-అడ్డగుంటపల్లి 60 అడుగుల రహదారిలోని భవనాన్ని తొలగించా ల్సిందిగా గతంలో పలుమార్లు కార్పొరేషన్‌ యజమా నిని కోరింది. ఈ భవనం కొన్నేళ్లుగా ఖాళీగా ఉండడం, వర్షానికి స్లాబుల లీకేజీలతో శిథిలావస్థకు చేరింది. కార్పొరేషన్‌ ఇంజనీర్లు భవనం శిథిలావస్థకు చేరిందని, వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతు దంటూ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా అత్యవసర పరిస్థితుల్లో భవనాన్ని కూల్చి వేసినట్టు కార్పొరేషన్‌ యంత్రాంగం పేర్కొంటుంది. శనివారం ఉదయం భవనం కూల్చివేసేందుకు కార్పొ రేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఎక్స్‌కావేటర్‌ను తీసుకువచ్చింది. రాజేష్‌ థియేటర్‌ వైపు ఉన్న భవ నం భాగాన్ని కూల్చివేస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండు అంతస్థుల భవనం ఒకేసారి కూలిపోవడంతో శిథిలాలు ఎక్స్‌కా వేటర్‌పై పడ్డాయి. ఆపరేటర్‌ క్షేమంగా బయటగా పడగా వాహనం బో ల్తా పడింది. ఒకేసారి భవనం కూలిపోవడంతో స్థాని కులు భయాందోళనకు గుర య్యారు. జనం పరు గులు పెట్టారు. పెద్ద ఎత్తున దుమ్ము వ్యాపించింది.

- 20ఏళ్లుగా వివాదంలోనే భవనం..

గోదావరిఖనిలో అభివృద్ధి చెందు తున్న ప్రాం తంలో ప్రధానమైన రాజేష్‌ థియేటర్‌, అడ్డగుంటపల్లి రహదారిని విస్తరించేందుకు కార్పొ రేషన్‌ ప్రయత్ని స్తున్నది. 60అడు గుల ఈ రహదారిని 80అడుగు లుగా మార్చాలని డిమాండ్‌ కూడా ఉంది. మార్కండేయకాలనీ ప్రధాన రహదారి ఆరంభంలోనే రోడ్డుపై భవనం ఉంది. ప్రధాన రహదారి విస్తరించినా ఈ భవనం తొలగించలేదు. భవన యజమాని కోర్టును ఆశ్రయించడంతో చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొదట ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆశించగా మున్సి పల్‌ చట్టం ప్రకారం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో టీడీఆర్‌లు జారీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. సుమారు 20ఏళ్లుగా ఇక్కడ విస్తరణ సాధ్యపడలేదు. భవనం రోడ్డుపై ఉండ డంతో అందులో వ్యాపారం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవ డంతో ఖాళీగా ఉంటుంది. దీంతో భవనం శిథిలావస్థకు చేరింది.

- భవనం కూల్చివేతలో రక్షణ చర్యల లోపం

రామగుండం నగరపాలక సంస్థ శనివారం గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రధాన రహ దారిపై రోడ్డుపై ఉన్న భవనం కూల్చివేత సమ యంలో సరైన రక్షణ చర్యలు తీసుకోలేదనే విమ ర్శలు వస్తున్నాయి. సాధారణంగా రోడ్డు విస్తరణ సమయంలో కొంత భాగం కూల్చివేసే సమయంలో జనసంచారం నిలిపివేయడం, చుట్టుపక్కల కట్టడాల కు ఇబ్బందులకు కలుగకుండా తొలగించడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేయ డం వంటి ముందస్తు చర్యలు తీసుకుంటారు. కానీ మార్కండేయకాలనీ రహదారిపై ఉన్న భవనం శిథిలావస్థలో ఉన్నది. కూల్చివేత సమయంలో డ్రిల్లింగ్‌ యంత్రాలు వినియోగించి పై స్లాబులు తొలగించిన తరువాత భవనాన్ని నేలమట్టం చేస్తారు. కానీ ఎక్స్‌కావేటర్‌తో కూల్చివేసే ప్రయత్నం లోనే అకస్మాత్తుగా భవనం మొత్తం కూలిపోయింది. భవనం మొత్తం ప్రధాన రహదారి వైపు పడిపోయింది. విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడ్డా యి. ఈ పక్కన ఉన్న భవనాలకు నష్టం జరగకున్నా భవనం ఒక్కసారిగా కూలి పోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడంతో జన సంచారం లేకపోవడంవల్ల ఎలాంటి నష్టం జరగలేదు. శిథిల భవనాలను తొలగించిన సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:05 AM