Share News

పెన్షన్ల చెల్లింపులో జాప్యం సరికాదు..

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:18 AM

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం జ్యాపం సరికాదని జిల్లా రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నా రు.

పెన్షన్ల చెల్లింపులో జాప్యం సరికాదు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం జ్యాపం సరికాదని జిల్లా రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నా రు. కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం జిల్లా రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపా ధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు పదవీ విమరణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేవరకు ఆందోళనలు చేపడుతామ న్నారు. 18నెలలు గడిచినా ఇంతవరకు ఉద్యోగు లకు రావాల్సిన బకాయిలు, జీపీ ఎఫ్‌, జీఐఎస్‌ ఇతర ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఉద్యోగ విర మణ పొం దిన తర్వాత రావాల్సిన ప్రయోజనాలు వెంటనే రాక ఇబ్బందులు పడుతున్నా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్‌లకు రావాల్సిన బకాయిలను ఏక మొత్తంలో చెల్లించాలని కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్ర మంలో రేవా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌, కనపర్తి దివాకర్‌, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావనపల్లి పరమేష్‌, పిల్లధర్మయ్య, వంగ సుధాకర్‌, జనపాల వెంకటయ్య, మద్దికుంట లక్ష్మణ్‌, ఎస్‌అర్‌ వెంకటేశ్వర్లు, తిరుపతి, మామిడిపల్లి శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, సాన రవీందర్‌, ప్రభాకర్‌, కుబేర స్వామి, రెహమాన్‌, సాదత్‌అలీ, సయ్యద్‌ మహబూబ్‌, ప్రకాష్‌రావు, గోవిందరావు, అంజయ్య, గాజలు రాఘవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:18 AM