Share News

విభేదాలకు తావులేకుండా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:34 AM

కాంగ్రెస్‌ పార్టీలో విభే దాలకు తావులేకుండా నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని ఏఐసీసీ కరీంన గర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా అబ్జర్వర్‌ మన్నే శ్రీనివాస్‌ అన్నారు.

విభేదాలకు తావులేకుండా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీలో విభే దాలకు తావులేకుండా నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని ఏఐసీసీ కరీంన గర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా అబ్జర్వర్‌ మన్నే శ్రీనివాస్‌ అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని రగుడు మల్లికార్జున కన్వెన్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అబ్జర్వర్‌ మన్నే శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్త లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి ఎంపి కపై వారి అభిప్రాయాలు, సూచనలు సానుకూలంగా విన్నారు. అనం తరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర విజయ వంతం అయిందని, ప్రజలు స్వాగతించారని అన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలలో నూత న ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌ దేశ వ్యాప్తంగా ఏఐసీసీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను క్షుణంగా పర్యవేక్షిస్తున్నారన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా నిర్వహించ డానికి ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించి బాధ్యతలను అప్పగించార న్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా ఉంటుం దని నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక ఉంటుంద న్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతో ముఖాముఖి మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ముఖ్య ఉద్దేశం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీని మరింత పటిష్టంగా బలపరచడమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సమన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, విభేదాలకు తావు లేకుండా ప్రతి ఒక కార్యకర్త, నాయకుల సలహాలు, సూచనలు అభిప్రాయాలను తీసుకున్నాకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. జిల్లాలో బ్లాక్‌ లెవల్‌ సమావేశా లు ఏర్పాటు చేస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు జిల్లాలోని ప్రతి నాయకుడు, కార్యకర్తలు తమకు సహకరించాలన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాం గ్రెస్‌ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్‌ పా ర్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో మమేకమై జిల్లా అధ్యక్షుడి పదవికి అర్హులైన వారిలో ఎవరైతే బాగుంటుందనే సూచనలను తీసుకొని ఏఐసీసీకి నివేదిక ఇవ్వడానికి శ్రీనివాస్‌ అబ్జర్వ ర్‌గా వచ్చారన్నారు. ఏఐసీసీ ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాలకు అబ్జర్వర్‌లను పంపించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గం స్థాయిలో సమావేశా లను ముఖాముఖి చర్చలను నిర్వహిస్తారన్నారు. ఈనెల 17 వరకు జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం చేసిన దరఖాస్తులను స్వీకరించి అదే రోజు కాంగ్రెస్‌ శ్రేణులతో శ్రీనివాస్‌ సమావేశం నిర్వహిస్తారని అన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సూచనలకు సం బంధించిన నివేదికను ఏఐసీసీకి పంపిస్తారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, పార్లమెం ట్‌ నియోజకవర్గం కన్వీనర్‌ చక్రధర్‌రెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్‌రావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వని త, మార్కెట్‌ కమిటి చైర్‌ పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:34 AM