Share News

‘దర్పణం’ నేటి యువతకు తోడ్పాటు..

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:49 AM

దర్పణం నేటి యువతకు తోడ్పా టును అందించడంతో పాటు రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ జనపాల శంకరయ్య అన్నారు.

‘దర్పణం’ నేటి యువతకు తోడ్పాటు..

సిరిసిల్ల రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : దర్పణం నేటి యువతకు తోడ్పా టును అందించడంతో పాటు రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ జనపాల శంకరయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్‌ హనుమాన్‌ మందిరంలో జిల్లా సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ జనపాల శంకరయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండలానికి చెందిన యువ రచయిత చక్రాల మల్లేష్‌ రచించిన దర్పణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు జనపాల శంకరయ్య మాట్లాడుతూ కాయం గాయం అయినాగానీ జీవం ఇచ్చిన అమృ తనం ద్వేషం కోసం ఏమో గానీ భాష్యం పంచు అమో గుణం అనే కవితలో లోతుగా అలోచిస్తే కన్నీళ్లు తెప్పిస్తుందన్నారు. రాబోయే ఈశా శతకమునకు చక్క ని భక్తి పౌరవశాన్ని ఆవిష్కరించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, మాజీ కౌన్సిలర్‌ గుండ్లపెల్లి పూర్ణచందర్‌, బాల సాహితీవేత్త వాసరవేణి పర్శరా ములు, వ్యాపార సంఘం ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, బూర దేవానందం, గడ్డం పర్శరాములు, సుల్తానా మల్లేష్‌, గోపాల్‌రెడ్డి, అంకారపు రవి, అంకారపు జ్ఞానోభా, దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:49 AM