ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:05 AM
బ్యాంక్ ఖాతాదారులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే దిశగా సైబర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశామని, బ్యాంక్ సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌కు పెరిగిందని సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారా యణ తెలిపారు.
సిరిసిల్ల ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : బ్యాంక్ ఖాతాదారులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే దిశగా సైబర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశామని, బ్యాంక్ సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌కు పెరిగిందని సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారా యణ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవనంలో బ్యాంక్ వార్షిక మహాసభ జరిగింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ రూ 13 కోట్లను ఆమోదించారు. బ్యాంకుకు సంబంధించిన వివిధ అంశాలపై సభ్యులు ప్రశ్నించారు. వార్షిక నివేదికను ఇంగ్లీష్‌లో ముద్రించినందుకు వేదిక వద్ద పలువు రు సభ్యులు నిరసనలు తెలిపారు. బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ ఆర్‌బీఐ నిబంధనల మేరకు నివేదిక రూపొందించామని తెలిపారు. సభ్యుల సూచన మేర కు తెలుగులో కూడా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడు తూ బ్యాంక్ పరిధిని విస్తరించడానికి దాదాపు 8బ్రాంచీలు స్థాపించడానికి అవకా శం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం రెండు బ్రాంచీలను ఏర్పాటుచేయడానికి పాల కవర్గం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. ఖాతాదారులు సికేవైసీ చేసుకోవాలని కోరారు. బ్యాంకు డిపాజిటు రూ.94.15 కోట్లు ఉందని, 14మాసాల్లో బ్యాంక్ డిపా జిట్లు రూ.18కోట్లు పెరిగాయన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడా నికి మొబైల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ వార్షిక నివేదికను సభ్యుల ముందుంచారు. వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, గాజుల బాలయ్య, గాజుల నారాయణ, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రా జు, బుర్ర రాజు, వేముల చుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనగందుల శంకర్, వల స హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.