Share News

నీట మునిగిన పొలాల్లో కోతలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:23 PM

తుఫాను రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి కోతలు కోసే సమయంలో ఆకాల వర్షంతో వరి పంట నేలవాలింది.

నీట మునిగిన పొలాల్లో కోతలు

కరీంనగర్‌ రూరల్‌, అక్టోబరు 31 (ఆంఽధ్రజ్యోతి): తుఫాను రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి కోతలు కోసే సమయంలో ఆకాల వర్షంతో వరి పంట నేలవాలింది. దీంతో కోతకు వచ్చిన వరి దాన్యం నెలపాలయ్యింది. ఉన్న పంటను రక్షించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 15వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షం కారణంగా దాదాపు 2,400 ఎకరాల్లో వరి, 1050 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. రైతులు వరి కోతలు కోసేందుకు కూడా వీలు కాని పరిస్థితి ఉంది. మళ్లీ వర్షం వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు పొలాల్లో నీరు ఉన్నా కోతలు ప్రారంభించారు. చైన్‌ హార్వెస్టర్లతో పొలాలు కోపిస్తూ ట్రాక్టర్లలో బురద, వాగులు దాటుకుంటూ ధాన్యాన్ని అతికష్టం మీద కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:23 PM