Share News

సాంస్కృతిక సౌరభం సాహితీ వికాసం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:16 AM

సాహిత్య, సాంస్కృతిక కళా రంగాల్లో జిల్లా సుస్థిర స్థానం సంపాదించుకుంది. 2025లో ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయియ.

    సాంస్కృతిక సౌరభం  సాహితీ వికాసం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో డాక్టర్‌ నలిమెల భాస్కర్‌కు కాళోజి పురస్కార ప్రదానం

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సాహిత్య, సాంస్కృతిక కళా రంగాల్లో జిల్లా సుస్థిర స్థానం సంపాదించుకుంది. 2025లో ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయియ. జిల్లా సాహితీవేత్తలు, కళాకారులు తమ ప్రతిభను దశదిశలా చాటారు. స్వచ్ఛంద, సాహిత్య, సామాజిక, కళా సేవా ఆధ్యాత్మిక సంస్థలు తమదైన శైలిలో కొత్త ఒరవడిని సృష్టించాయి. ఈ యేడు జరిగిన కార్యక్రమాలను ఓసారి గుర్తు చేసుకుందాం..

ఫ సాంస్కృతిక కార్యక్రమాలు...

- జనవరి 8న కళాభారతిలో రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా నాటక సమాజాల కమిటీ ఆవిర్భవించింది. కళాభారతిలో కరీంనగర్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 15న గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి నాటికల పోటీల్లో చైతన్య కళాభారతి కళాకారులు ప్రదర్శించిన చీకటి పువ్వు నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. 28న జిల్లా కేంద్రంలోని ఫిలిగ్రీ వస్తువుల ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏఎస్‌సీఐ శాస్త్రవ్తేల బృందం సందర్శించింది.

- ఫిబ్రవరి 28న కరీంనగర్‌కు చెందిన కాస యతిరాజ్‌ హైదరాబాద్‌లో పీసీ సర్కార్‌ అవార్డు అందుకున్నారు.

- ఏప్రిల్‌ 4న కళాభారతిలో చైతన్య కళాభారతి నాటక సంస్థ వార్షికోత్సవం నిర్వహించారు. మే4న హైదరాబాద్‌లో కవి, గాయకుడు బుర్ర సతీశ్‌గౌడ్‌ గద్దర్‌ ఐకాన్‌ అవార్డు అందుకున్నారు. 8న కరీంనగర్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమీ, కళారవళి సోసియో కల్చరల్‌ అసోసియేషన్‌, సల్వాజీ ఈవెంట్స్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్విరామ చిరుతల భజనకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు వారు అవార్డు ప్రదానం చేశారు.

- రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ అవార్డులు ప్రకటించింది. కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ పొన్నం రవిచంద్రతొలి బెస్ట్‌ ఫిలిం క్రిటిక్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన జూన్‌ 14న అవార్డు అందుకున్నారు. 15న కళాభారతిలో తెలంగాణ కళాకారులతో పాటల పల్లకిలో పేరుతో 12 గంటలపాటు కార్యక్రమం నిర్వహించారు.

- జూలై 5న జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. అక్టోబరులో 15న ఆడపిల్లల జీవితాలపై కలెక్టర్‌ పమేలా సత్పతి పాడిన ఓ చిన్ని పిచ్చుక వీడియో సాంగ్‌ ఆవిష్కరించారు.14న ఫిలింభవన్‌లో చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహించారు. 28న కళాభారతిలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

- డిసెంబరు 2న విద్యా-వైద్యం-అవగాహన అంశంపై కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఏవో అగస్టీన్‌ రచన, దర్శకత్వంలో హైదరాబాద్‌లో ప్రదర్శించిన నాటిక ప్రథమ బహుమతి సాధించి జాతీయ నాటిక పోటీలకు ఎంపికైంది. 9న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో పాల్గొన్న అతిథులకు జిల్లాకు చెందిన సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారులు రూపొందిన 60 వెండి బుద్ధ ప్రతిమలను హైదరాబాద్‌లో అందజేశారు.

ఫ సాహిత్య కార్యక్రమాలు...

- జనవరి 2న రాష్ట్ర స్థాయి మానేటి లఘు చిత్ర పోటీలు నిర్వహించారు. 7న డాక్టర్‌ నలిమెల భాస్కర్‌కు హైదరాబాద్‌లో గవర్నర్‌, స్పీకర్‌ పీవీఎన్‌ఆర్‌ స్మారక పురస్కార ప్రదానం చేశారు. 12న తెరవే ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో డాక్టర్‌ బెల్లి యాదయ్యకు అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదానం చేశారు. 22న గిడుగు రాంమూర్తి పంతులు ఫౌండేషన్‌, శంకర వేదిక సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కరీంనగర్‌కు చెందిన గంప ఉమాపతి, నగునూరి రాజన్నలకు గిడుగు జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. 23న ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్‌ మండలోజు నరసింహస్వామి, డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ పుస్తకాలు ఆవిష్కరించారు.

- ఫిబ్రవరి 5న తెరవే ఆధ్వర్యంలో వట్టికోట ఆళ్వార్‌ స్వామి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. 23న తెరవే ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో వట్టికోట ఆళ్వార్‌ స్వామి ప్రజల మనిషి నవలపై అజరామర అక్షరం పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. 24న డాక్టర్‌ నలిమెల భాస్కర్‌కు హైదరాబాద్‌ సిటీ కాలేజ్‌లో ముగ్దుం మొహియొద్దీన్‌ నేషనల్‌ అవార్డు ప్రదానం చేశారు.

- మార్చి 6న మహిళా దినోత్సవం సందర్భంగా రచయిత్రి తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, గుత్తా నాగదుర్గ, జానపద గాయని గొట్టె కనకవ్వకు కఫిసొ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాల ప్రదానం చేశారు. 8న కరీంనగర్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమి, జిల్లా నాటక సమాజాల సమాఖ్య, కళారళ సోషియో కల్చరల్‌ అకాడమి ఆధ్వర్యంలో కలెక్టర్‌ పమేలా సత్పతికి మహిళా శక్తిమాన్‌ అవార్డు అందజేశారు. 17న హైదరాబాద్‌ సంస్కృత అకాడమిలో పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి పేరిట ఆచార్య హరేకృష్ణ శతపతికి జాతీయ స్థాయి సంస్కృత పురస్కార ప్రదానం చేశారు.

- ఏప్రిల్‌ 6న సాహతీ సోపతి ఆధ్వర్యంలో డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ రాసిన ఏడు పుస్తకాలను ఆవిష్కరించారు. 19న జాతీయ సాహిత్యపరిషత్‌ ఆధ్వర్యంలో కె మనోహరాచారి వారధి పేరుతో రాసిన కథా సంకలనం ఆవిష్కరించారు.

-మే 4న తెరవే, ఉమ్మడిశెట్టి లిటరసీ ట్రస్టు ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో ఉమ్మడిశెట్టి సాహిత్య పురస్కారాలు ప్రదానం చేశారు. 23న ఫిలింభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా లోక్‌ సత్తా ఉద్యమ సంస్థ, సమాచార హక్కు రక్షణ వేదిక సంస్థ వ్యవస్థాపకుడు నరెడ్ల శ్రీనివాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరింంచారు. 25న అన్నవరం దేవేందర్‌ సాహిత్యంపై ఫిలింభవన్‌లో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కవి సంధి కార్యక్రమం నిర్వహించారు.

- జూన్‌ 2న డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాళోజి పురస్కారం అందుకున్నారు. 6న తెలుగు భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో తెలుగు పద్య పఠన పోటీలు నిర్వహించారు. 12న ఎన్నీల ముచ్చట్లలో భాగంగా పెనుగొండ సరసిజ రచించిన పద.. అలా నడిచొద్దాం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

- జూలై 13న పొన్నం రవిచంద్రకు భారతీయ విద్యాభవన్‌లో హైమా అవార్డు ప్రదానం చేశారు. 20న తెరసం ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో దాశరథి శత జయంతి సదస్సు నిర్వహించారు. 22న ప్రభుత్వం అందించే దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని రవీంద్ర భారతిలో అన్నవరం దేవేందర్‌కు అందజేశారు. 27న భువనగిరిలో అన్నవరం దేవేందర్‌కు సినారె సాహిత్య పురస్కార ప్రదానం చేశా,శారు.

- ఆగస్టు 6న తెరవే ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో విమలక్కకు జయశంకర్‌ స్మారక రాష్ట్ర స్థాయి స్ఫూర్తి పురస్కార ప్రదానం చేశారు. 25న ఫిలింభవన్‌లో తెరవే ఆధ్వర్యంలో బూర్ల వేంకటేశ్వర్లు రాసిన తలపుల పుటలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

- సెప్టెంబరు 10న ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో విశ్వనాథ జయంతి వేడుక నిర్వహించారు. 30న ఎస్‌వీఎస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో యజ్ఞవరాహక్షేత్రంలో డాక్టర్‌ మాదిరాజు బ్రహ్మానందరావు రాసిన వజ్జా లగ్గం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

- అక్టోబరు 7న ఎన్నీల ముచ్చట్ల 150 నెలల వేడుక నిర్వహించారు. 12న తెరవే ఆఽధ్వర్యంలో షోయబుల్లాఖాన్‌ జయంతి సమావేశం నిర్వహించారు. 19న డీర్‌ పార్కులో మరో గ్రంఽథాలయం ఉద్యమాన్ని ప్రారంభించారు.

- నవంబరులో 2న డాక్టర్‌ నలిమెల భాస్కర్‌కు నిజామాబాద్‌లో అమృతలత జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేశారు. 8న శ్రీభాష్యం విజయసారథి శారదాపదకింకిణిపై ఎస్‌వీఎస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ప్రసంగించారు.

-. 14న హైదరాబాద్‌లో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వికె శుక్లా సాహిత్య సమాలోచనం అంశంపై వారాల ఆనంద్‌ ప్రసంగించారు. 15న విజయసారథి భారత భారతి కావ్యంపై యజ్ఞవరాహక్షేత్రంలో మల్లావఝల నారాయణ శర్మ ప్రసంగించారు.

Updated Date - Dec 30 , 2025 | 12:16 AM