Share News

భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:49 AM

భూసార పరీక్షల ఆధారంగా పంటలను సాగు చేయాలని నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొం డూరు రవీందర్‌రావు పేర్కొన్నారు.

భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు

గంభీరావుపేట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : భూసార పరీక్షల ఆధారంగా పంటలను సాగు చేయాలని నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొం డూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేం ద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళ వారం క్రిబ్‌కో ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన కొండూరు రవీందర్‌ రావు మాట్లాడారు. భూసార పరీక్షలు చేయించి వచ్చిన ఫలితాల ఆదారంగా పంటలను సాగు చేసి అధిక దిగుబడులను పొందాల న్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ నితిన్‌, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ భూపతి సురెందర్‌, క్రిబ్‌కో జిల్లా మేనేజర్‌ ప్రేమ్‌తేజ, దాన్విందర్‌ సింగ్‌, శ్రావన్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:49 AM