Share News

వేములవాడలో కార్తీక భక్తుల రద్దీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:20 AM

వేములవాడ కార్తీక మాసం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

వేములవాడలో కార్తీక భక్తుల రద్దీ

వేములవాడ టౌన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వేములవాడ కార్తీక మాసం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని, భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో కార్తీకదీపాలను వెలిగించారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమైన కారణంగా రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులను సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అన్ని రకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయంలోనే కొనసాగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు.

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం సందర్భంగా రాజరాజేశ్వర స్వామివారిని, భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బద్ది పోచమ్మ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

Updated Date - Nov 03 , 2025 | 12:20 AM