రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:48 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ కల్చరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. రాజన్నకు ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకుని తరించారు. అనంతరం అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు.