మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:56 AM
లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ శుక్రవారం సౌభాగ్యాన్ని అందించాలని మహిళలు నోములు, వ్రతాలతో మొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ కల్చరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ శుక్రవారం సౌభాగ్యాన్ని అందించాలని మహిళలు నోములు, వ్రతాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అష్టైశ్వరాలు, సిరిసందలను మెండుగా ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిం చేందుకు మహిళలు క్యూ లైన్‌లో నిరీక్షించారు. అమ్మవారికి నూతన వస్ర్తాలతో ఒడిబియ్యం సమర్పించారు. అనం తరం తులసీమాతకు పూజలు చేశారు. మహిళలు పసుపు, కుంకుమ, కనుముతో ఒక్కరికి ఒక్కరు వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమానికి ఈవో రాధాబాయి హజరయ్యారు. ఆలయానికి వ చ్చిన భక్తులకు ఇబ్బందులు తలేత్తకుండా ఉండేందు కు ఉద్యోగులను అప్రమత్తం చేశారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. రాజన్న ఆలయంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఉద యం సాయంత్రం చతుష్షష్టి ఉపచారాలతో విశేష పూజలు నిర్వహిం చారు. సాయంత్రం 4 గంటలకు మహాలక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజలు ఘనంగా నిర్వహించారు.