Share News

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:51 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పార్వతి, రాజరాజేశ్వరస్వామి వార్లను దర్శించకున్నారు. అనంతరం రాజన్నకు ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

రాజన్న సేవలో పరకాల ఎమ్మెల్యే..

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం రాజన్న ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకలు స్వాగతం పలికారు. రాజన్న ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయాధికారులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఈవో..

దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలతో వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని గురువయ్యనగర్‌ సమీపంలో ఆలయ ఈవో రాధాబాయి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయానికి సబంధించిన స్థలంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి మొక్కులు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:51 AM