పంటల బీమాను అమలు చేయాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:05 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయడంతో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు సాగర్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయడంతో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు సాగర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు శనివారం నిర్వ హించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన సాగర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ 2024కు రైతు భరోసా వర్తింపజేయలేదన్నారు. ఎకరాకు రూ.7వేల 500, ఇస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6వేలు తగ్గించిందన్నారు. 2025 యాసంగిలో 53.4 లక్షల మంది రైతులకు రూ 4వేల 366 కోట్లు 72 లక్షలు మాత్రమే చెల్లించిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 4పంటలకు కేంద్ర ప్రభుత్వం కన్నా అదనపు కనీస మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. ధాన్యం క్వింటాల్‌కు అదనంగా రూ 500బోనస్ చెల్లిస్తామని ప్రకటించి అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటల బీమాను అమలు చేసి రైతులకు ఇచ్చిన భరోసా కింద డబ్బుల రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యు లు స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, మాల్లారపు అరుణ్ కుమార్, విమల, ఎర్రవెళ్లి నాగరాజు, అన్నల్‌దాస్ గణేష్; మల్లారపు ప్రశాంత్; గురజాల శ్రీధర్, సూరం పద్మ, రమేష్ చంద్ర, రామంచా అశోక్, గీస బిక్షపతి, నక్కదేవదాస్, మాల్యాల నర్సయ్య, సామల పల్లి రాములు, మపోజ్, సిరిమల్లే సత్యం, ఎలిగేటి శ్రీనివాస్, ఉడుత రవి, బెజుగం సురేష్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.