చట్టాలపై అవగాహనతో నేరాలు తగ్గుముఖం
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:27 AM
చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల ఆవరణలో గురువారం ఎడవెల్లి అపర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల హక్కుల రక్షణ కోసం ఫోక్స్‌చట్టం ఉందన్నారు. చిన్నపిల్లలు మత్తుపదార్థాల బారినపడి అమూల్యమైన జీవితాలను పాడుచేసుకోవద్దన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మారుతున్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగడానికి ఎక్కువ కారణం మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపటమేనన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. లీగల్ సర్వీసెస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిణి ప్రేమలత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, డిప్యూటీ ఎల్‌ఏడీసీఎస్ మల్లేష్‌యాదవ్, ఎడవెల్లి అపర్ణ ఫౌండేషన్ ఆర్గనైజర్ ఎడవెల్లి హరీష్, ఉపాధ్యాయులు మహేష్‌చంద్ర, రమణారెడ్డి, మంజుల, లత, అనీల్‌కుమార్, సునీత, కవిత, స్వప్న, సంపత్‌రావు, సత్తయ్య, ఫయాజ్‌మొహమ్మద్, సుజాతదేవిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.