బడుగు, బలహీన వర్గాలకు అండగా సీపీఐ
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:17 AM
బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి, వారి సమస్యల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తు న్నదని సీపీఐ అని జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నా రు.
వేములవాడ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి, వారి సమస్యల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తు న్నదని సీపీఐ అని జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నా రు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం వేములవాడ పట్టణంలోని అమరవీ రుల స్థూపం నుంచి గుమ్మి పుల్లయ్య స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుపేదల పక్షాన కొట్లాడి వందలాది ఎకరాల భూములను పంచిందన్నారు. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, అన భేరి ప్రభాకర్‌రావు, కె.వి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మి పుల్లయ్య లాంటి నాయకులు నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. అనంతరం గుమ్మి పుల్లయ్యకు ఘన నివాళుల ర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు, వేములవాడ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవ రాజు, రూరల్ మండల కార్యదర్శి పండుగ పోచమల్లు, బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు కే.వి. అనసూర్య, మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి పందుల మల్లేశం, గ్రామపంచాయతీ కార్మిక సం ఘం జిల్లా నాయకులు దుండ్రపెల్లి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యు లు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్, నర్సయ్య, క్రాంతి, లింగం, రమేష్, గుమ్మి పుల్లయ్య వారసులు గుమ్మి పవన్, మధు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.