Share News

సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:59 PM

సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యునిస్టు ఆవిర్భవించి డిసెంబరు 25 నాటికి వందేళ్లు పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో శత జయంతి ఉత్సవాలను డిసెంబరు 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నామన్నారు. కుమరం భీం జిల్లా జోడేఘాట్‌ నుంచి ఽభద్రాచలం వరకు నిర్వహించే రాష్ట్ర జాతాను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబరు 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బత్తుల బాబు, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి, పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:59 PM