Share News

సీపీ గౌస్‌ ఆలం సుడిగాలి పర్యటన

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:10 AM

పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం బుధవారం కరీనగర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లు టవర్‌సర్కిల్‌, బస్టాండ్‌, ఇందిరాచౌక్‌ తదితర ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సీపీ గౌస్‌ ఆలం సుడిగాలి పర్యటన

కరీంనగర్‌ క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం బుధవారం కరీనగర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లు టవర్‌సర్కిల్‌, బస్టాండ్‌, ఇందిరాచౌక్‌ తదితర ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు జరుగుతున్నందున పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. బస్టాండ్‌ ఆవరణలో సీసీ కెమెరాల పనితీరు గురించి తెలుసుకున్నారు. కరీంనగర్‌ ఒకటో ఠాణా, రెండో ఠాణా, మూడో ఠాణాల పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ పర్యటించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను, ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో టౌన్‌ డివిజన్‌ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్‌ ఏసీపీ స్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్‌, జాన్‌రెడ్డి, పర్శ రమేష్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి రాజు, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి

చొప్పదండి: విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించి, నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాలకు పోలీస్‌ అధికారులను కేటాయించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు, పోలీస్‌ స్టేషన్‌లో అన్నిరకాల విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్‌, రిసెప్షన్‌, కోర్టు డ్యూటీ, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, బీట్‌, పెట్రోలింగ్‌, సమన్లు, విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, ప్రతినెల నూతన సమాచారాన్ని సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌, ఎస్‌ఐ అనూష, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:10 AM