సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:17 AM
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తికొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు పత్తిరైతులు దళారీల బారినపడి మోసపోవద్దన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి పత్తిని తీసుకొని వచ్చి మద్దతు ధర క్వింటాళులకు రూ 8110 పొందాలన్నారు. ఈసంవత్సరం స్లాట్ విధానం ద్వారానే పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. పత్తి కొనుగోళ్ళలో అక్రమాలను నివారించేందుకు కొత్త విధానాన్ని సీసీఐ ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన సమాచారం అనంతరమే పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలన్నారు. ఈ విధానం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, ప్రసాద్, రమణారెడ్డి, అయిలయ్య, పసుల వెంకటి, తిరుపతిగౌడ్, ఎలుక రామస్వామి, రాజేశం, సురేందర్‌రెడ్డి, సత్యారెడ్డిలతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.